కరెంట్ కట్ అయితే నిమిషాల్లో పొలాల వద్దకే విద్యుత్ అంబులెన్స్‌లు

 తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో  శుభవార్త చెప్పింది. ఇకపై పొలాల్లో కరెంట్ కట్, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వంటి విద్యుత్ సమస్యలు ఎదురైతే రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదంట ఇకపై. కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు… నిమిషాల్లోనే పొలాల వద్దకు విద్యుత్ అంబులెన్స్‌లు వచ్చి సమస్యను పరిష్కరిస్తాయి.


విద్యుత్ అంబులెన్స్‌లు అంటే ఏమిటి?

విద్యుత్ అంబులెన్స్‌లు అనేవి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు. వీటిలో

అవసరమైన టూల్స్

ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు సామగ్రి

అనుభవజ్ఞులైన విద్యుత్ సిబ్బంది

అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎక్కడైనా విద్యుత్ సమస్య వచ్చిందంటే వెంటనే అక్కడికి వెళ్లి స్పాట్‌లోనే సమస్యను పరిష్కరించడమే వీటి ప్రధాన లక్ష్యం.


రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే?

ఇప్పటివరకు చాలా గ్రామాల్లో కరెంట్ సమస్య వస్తే

పంటలకు నీళ్లు పెట్టలేకపోవడం

మోటార్లు పనిచేయక నష్టం రావడం

అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి

ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఈ విద్యుత్ అంబులెన్స్ సేవలతో

రైతుల సమయం ఆదా అవుతుంది.

పంటలకు నష్టం తగ్గుతుంది.

వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది.


ఎలా ఫిర్యాదు చేయాలి అంటే?

రైతులు తమ పొలాల్లో విద్యుత్ సమస్య ఎదురైతే

 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి

ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే సంబంధిత ప్రాంతానికి దగ్గరలో ఉన్న విద్యుత్ అంబులెన్స్‌ను పంపిస్తారు. అధికారులు చెప్పినట్లుగా, 24 గంటల్లో సమస్య పరిష్కారం చేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు.


ప్రభుత్వం లక్ష్యం ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం రైతుల వ్యవసాయం నిరంతరంగా కోనసాగాలని, విద్యుత్ సమస్యల వల్ల పంట నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ముందుగానే సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తంగా చెప్పాలంటే…

ఈ విద్యుత్ అంబులెన్స్ సేవలు తెలంగాణ రైతులకు నిజంగా బంపర్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. కరెంట్ సమస్య అంటే భయపడాల్సిన అవసరం లేకుండా, త్వరితగతిన పరిష్కారం లభించే విధానం ఇది బాగుంది kada.

 మీకు మీ రైతులకు ఉపయోగపడే ఈ సమాచారం మీ గ్రామంలో ఉన్న అందరితో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి బాయ్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students