New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు WhatsApp Telegram Facebook SMS లలో Happy New Year మెసేజ్‌లు వీడియోలు లింక్‌లు వరదలా వస్తాయి కదా. అందుకనే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా యాక్టివ్ అవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల పోలీసులు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న కొన్ని లింక్‌లు పూర్తిగా నకిలీవి. వాటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ బ్యాంక్ ఖాతా WhatsApp అకౌంట్‌కు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది.
Happy New Year Video మీ ఫోటోతో న్యూ ఇయర్ వీడియో రెడీ ఈ లింక్ ఓపెన్ చేయండి సర్ప్రైజ్ ఉంది ఇలాంటి మెసేజ్‌లతో వచ్చే లింక్‌లను క్లిక్ చేస్తే తెలియకుండా మీ ఫోన్‌లో హానికరమైన యాప్ డౌన్‌లోడ్ అవుతుంది.
ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ కాన అయితే మీ ఫోన్‌లోని OTPలు బ్యాంక్ వివరాలు ఫోటోలు కాంటాక్ట్స్ పూర్తిగా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. అందుకనే కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ WhatsApp అకౌంట్ కూడా హ్యాక్ అవుతుంది.
చాలామంది నాకు బ్యాంక్ యాప్ లేదు బ్యాలెన్స్ లేదు అనుకుంటారు కానీ అసలు సమస్య అక్కడ కాదు. ఒకసారి మీ ఫోన్ కాన హ్యాక్ అయితే మీ WhatsApp నుంచి మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు కూడా అదే లింక్ వెళ్తుంది. మీ పేరుతో డబ్బులు అడిగే మెసేజ్‌లు వెళ్లే ప్రమాదం ఉంది.
అందుకే పోలీసులు ముందుగానే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అపరిచిత లింక్‌లను ఎప్పటికీ క్లిక్ చేయవద్దు. WhatsApp లేదా Telegramలో వచ్చే యాప్ ఫైల్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు. Play Store తప్ప వేరే చోట నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయకూడదు. WhatsAppలో Two Step Verification తప్పకుండా ఆన్ చేసుకోవాలి. అనుమానాస్పద లింక్‌లు వచ్చిన వెంటనే వాటిని డిలీట్ చేయాలి.
నిజంగా ఎవరో న్యూ ఇయర్ విషెస్ చెప్పాలంటే సాధారణ మెసేజ్ చాలు లింక్ అవసరం లేదుమనకి. మీకు తెలిసిన వాళ్ల నుంచి వచ్చినా సరే లింక్ అనుమానంగా అనిపిస్తే ముందుగా వాళ్లను అడగాలి.
చిన్న జాగ్రత్త కొత్త సంవత్సరం అంతా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఒక చిన్న క్లిక్ వల్ల బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు. అందుకే లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడా షేర్ చేయండి వాళ్లను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండీ. అడ్వాన్స్ happy new year అందరికి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి