విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students


 విద్యార్థులకు శుభవార్త… సంక్రాంతి పండుగ హాలిడేస్ లిస్ట్ ముందే వచ్చేసింది.

పాఠశాల విద్యార్థులకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు అధికారికంగా ప్రకటించారు. విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు అమల్లోకి రానున్నాయి.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి విద్యార్థులకు సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు జనవరి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు స్కూల్ పిల్లలకు పెద్ద విరామం లభించనుంది.

సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకునే అవకాశం పొందనున్నారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే కుటుంబాలకు ఈ సెలవులు ఎంతో ఉపయోగపడనున్నాయి.

సంక్రాంతి అంటే గాలిపటాలు, భోగి మంటలు, హరిదాసులు, పండుగ సందడి. ఈ అన్నింటినీ పిల్లలు దగ్గరుండి చూసి ఆనందించే అవకాశం ఈ సెలవుల వల్ల కలగనుంది. చదువుతో పాటు మానసిక విశ్రాంతి కూడా పిల్లలకు చాలా అవసరం. ఈ సెలవులు అదే అవకాశాన్ని అందిస్తున్నాయి.

అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమకు అనుకూలంగా సెలవుల తేదీల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉండటంతో, విద్యార్థులు తమ స్కూల్ నుంచి వచ్చే అధికారిక సమాచారం కూడా ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మొత్తంగా చూస్తే విద్యార్థులకు ఇది నిజంగా బంపర్ గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకుని ఆనందంగా గడపండి. అలాగే తెలంగాణ పిల్లలకి కూడా ఇవే డేట్స్ ఉండవచ్చని అంచనా. ఇది ఏమనైనా బాగానే హాలిడేస్ వచ్చినవి కదా ఫుల్ గా ఎంజాయ్ చేయండి బాయ్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ