కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు కారణం ఇదే!

 కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ ప్రకటన.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు విషయం ఇదే!

కొత్త సంవత్సరం రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. “ఇక సబ్సిడీలు బంద్” అన్న హెడ్‌లైన్ చూసి అందరికీ భయం వచ్చినా, అసలు విషయం వేరేలా ఉంది.

మొదట క్లియర్‌గా చెప్పుకోవాలి. ఇది అన్ని సబ్సిడీల గురించి కాదు. రైతులకు, పేదలకు, ఇతర పథకాలకు ఇచ్చే సబ్సిడీలు ఏవీ ఆపలేదు. ఒకే ఒక విభాగానికి సంబంధించిన సబ్సిడీనే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అంటా.


అదేంటి అంటే…

ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు ఇచ్చే సబ్సిడీ.

ఇప్పటివరకు PM e-Drive పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ–త్రీ వీలర్లకు ప్రభుత్వం డబ్బు సహాయం ఇచ్చేది. కానీ దీని వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనగలిగారు. కాలుష్యం తగ్గాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తెచ్చారు అప్పుడు.

కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే –

“ఈ పథకం కింద పెట్టుకున్న లక్ష్యం పూర్తయ్యింది” అని చెబుతుంది.

అంటే, ప్రభుత్వం అనుకున్నంత సంఖ్యలో ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చేశాయట. ఇక ఈ దశలో సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ సబ్సిడీని నిలిపివేసింది ఇప్పుడు.

ఇది విన్న వెంటనే చాలామందికి ఒకటే డౌట్ –

“ఇకపై ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే ఖర్చు పెరుగుతుందా అని?”

అవును, కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సబ్సిడీ లేకపోతే కంపెనీలు పూర్తిగా తమ ఖర్చుతోనే వాహనాలు అమ్మాల్సి వస్తుంది. దాంతో కొత్తగా కొనాలనుకునే వాళ్లకి భారం పడొచ్చు.

కానీ ప్రభుత్వం ఇంకో విషయం కూడా చెబుతోంది.

ఇప్పుడైతే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ బాగా నిలబడ్డదని, కంపెనీలు కూడా స్వయం సమృద్ధిగా తయారయ్యాయని అంటోంది. అంటే ఇకపై మార్కెట్ తానే నడుస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తుంది.

ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు.

ఇది కేవలం ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాల సబ్సిడీ మాత్రమే.

రైతు పథకాలు, రేషన్, గ్యాస్, ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం లేదు.

మొత్తానికి చెప్పాలంటే…

కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల రంగం ప్రభుత్వ సబ్సిడీ మీద కాకుండా, మార్కెట్ మీద నడవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు.

మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటే మాత్రం ఇక నుంచి సబ్సిడీ మీద ఆశ పెట్టుకోకుండా, ధరలు, బ్యాంక్ లోన్లు, ఆఫర్లను చూసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందే మీరు. ఇంకా చూసి కొనుకోండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students