భారతీయ రైల్వే కీలక నిర్ణయం పెరిగిన ఛార్జీలు అమల్లోకి


 భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం భారతీయ రైల్వే శాఖ రైలు టికెట్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

 ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై రైల్లో ప్రయాణం చేయాలంటే మునుపటికంటే కొంత ఎక్కువ ఖర్చు తప్పదు.

 ఈ ఛార్జీల పెంపు ముఖ్యంగా మెయిల్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లపై వర్తిస్తుంది.   అయితే సబ్‌ర్బన్ రైళ్లు సీజన్ టికెట్లు చిన్న దూర ప్రయాణాలపై మాత్రం ఎలాంటి ఛార్జీల పెంపు లేదు రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం సాధారణ సెకండ్ క్లాస్‌లో 216 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు మాత్రమే కొద్దిగా ఛార్జీలు పెరిగాయి.

 అలాగే మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ప్రతి కిలోమీటర్‌కు సుమారు రెండు పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు ఉదాహరణకు ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే పది నుంచి పదిహేను రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్ ఛార్జీలు సూపర్ ఫాస్ట్ ఛార్జీలు జీఎస్టీ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు సేవల నాణ్యతను మెరుగుపరచడం నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  దూర ప్రయాణాలు చేసే వారు టికెట్లు బుక్ చేసుకునే ముందు కొత్త ఛార్జీలను తప్పకుండా పరిశీలించాలని రైల్వే శాఖ సూచిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students