ఈ క్రెడిట్ కార్డ్ గురించి విన్నారా ప్రపంచంలో చాలా అరుదైనది

 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసా. ఈ కార్డు తో విమానం కూడా కొనగలరు. ఎంత బిల్ చేసినా అసలు లిమిట్ అనే మాటే ఉండదు.





ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది క్రెడిట్ కార్డులతోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే షాపింగ్ చేసిన వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. బిల్ చెల్లించడానికి ఒక నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతున్నారు.

మనం డెబిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బు వెంటనే తగ్గిపోతుంది. కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ ను ముందుగా ఉపయోగించి, తరువాత నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణ క్రెడిట్ కార్డులకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేది మన ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ నిర్ణయిస్తుంది. అలాగే బిల్ చెల్లించడానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది.

కానీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి లిమిట్ ఉండదు. కాల పరిమితి కూడా ఉండదు. ఈ కార్డునే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా పిలుస్తారు.

ఈ కార్డు పేరు అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచూరియన్ కార్డు. దీనినే బ్లాక్ కార్డ్ అని కూడా అంటారు. ఈ కార్డు మన దగ్గర ఉంటే సంపద, ప్రతిష్ట, ఆర్థిక స్థిరత్వానికి గుర్తుగా భావిస్తారు.

ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి క్రెడిట్ లిమిట్ ఉండదు. మీరు ఎంత ఖర్చు చేసినా ఆపే పరిమితి ఉండదు. ఖరీదైన ఆభరణాలు, వజ్రాలు మాత్రమే కాదు. ప్రైవేట్ జెట్ విమానం కూడా ఈ కార్డు తో కొనుగోలు చేయవచ్చు.

ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ కార్డు టైటానియం మెటల్ తో తయారు చేయబడింది. ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డు కంటే కొంచెం బరువుగా, చాలా ప్రీమియం లుక్ లో ఉంటుంది.

ఈ కార్డు పొందాలంటే మనం సాధారణంగా బ్యాంక్ లో అప్లై చేసి తీసుకునే అవకాశం లేదు. ఎవరు ఈ కార్డు కి అర్హులు అనే విషయాన్ని అమెరికన్ ఎక్స్ప్రెస్ సంస్థే స్వయంగా నిర్ణయిస్తుంది.

ఈ కార్డు అధికారికంగా 1999 లో ప్రారంభించబడింది. అయితే 1980ల నుంచే ఈ కార్డు గురించి పుకార్లు ఉన్నాయి. అప్పట్లో ఈ కార్డు బ్రూనై సుల్తాన్ లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ సీఈఓ లాంటి అతి సంపన్నుల వద్ద మాత్రమే ఉందని చెప్పేవారు.




ప్రస్తుతం అమెరికాలో సుమారు ఇరవై వేల మంది మాత్రమే ఈ కార్డు ఉపయోగిస్తున్నారని అంచనా. దీని అరుదైన స్థాయి ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో అయితే ఈ కార్డు యజమానుల సంఖ్య ఇంకా తక్కువ. నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు వంద మంది మాత్రమే ఈ కార్డు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్డు ద్వారా సంవత్సరానికి భారత కరెన్సీ లో మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసి, సకాలంలో తిరిగి చెల్లించాలి. మీరు ఫారం ఫిల్ చేసినా, తుది నిర్ణయం మాత్రం అమెరికన్ ఎక్స్ప్రెస్ చేతుల్లోనే ఉంటుంది.



అలా చూస్తే నిజంగా ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డు అని చెప్పొచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students