ఏపీ కొత్త జిల్లాలు ఖరారు.. గ్రామాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టమైంది.
ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా వ్యవస్థ మరింత సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
అయితే, ఈ నోటిఫికేషన్‌పై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఏ గ్రామం ఏ జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు, ఏ మండలం ఏ జిల్లాలోకి మారుతుంది అనే అంశాలపై స్పష్టత కావాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే –
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గ్రామాల పేర్లు, మండలాల వివరాలు, జిల్లా సరిహద్దుల పూర్తి జాబితాను ఇంకా మెన్షన్ చేయలేదు.
అంటే, ఇది పూర్తిస్థాయి గ్రామాల వారీ లిస్ట్ కాదు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన తుది ఆమోదం మాత్రమే.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, గ్రామాలు–మండలాలు–జిల్లాల పూర్తి వివరాలతో కూడిన డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడిగా విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు ఎలాంటి ఊహాగానాలకు లోనవ్వవద్దని అధికారులు సూచిస్తున్నారు.
మొత్తానికి, కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇక గ్రామాల వారీ స్పష్టత కోసం మరో నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. తెలిసింది కదా మీరు ఎం అంటారు కామెంట్ చేయండి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి