గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ కొత్త ట్రైన్ సర్వీస్!
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి రైల్వే శాఖ good news చెప్పింది. అందుకే చాలా మంది ట్రైన్‌లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. అదే కాకుండా ప్రయాణికుల భద్రతా, సౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ చేపడుతున్న మార్పులు కూడా ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అందరికి.
దీంతో ట్రైన్‌లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు (నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపగా.. అందుకుగాను మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
కొత్త సర్వీస్‌ల వివరాలు ఏంటంటే
గుతకల్లు – మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు మధ్యన 57407/ 57408 నెంబర్ గల రెండు రోజువారీ ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు జెరూగనున్నవి.
ఇంకా 57407 నెంబర్‌గల గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ ప్యాసింజర్ ట్రైన్ రోజు సాయంత్రం 5:30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి.. రాత్రి 11:30 గమ్యాస్థానికి చేరకుంటుంది.
అలాగే 57408 నెంబర్ గల మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు ప్యాసింజర్ ట్రైన్ ఉదయం 04: 30కు మార్కపూర్ రోడ్డు నుంచి బయల్దేరి ఉదయం 10:30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి అంటే
ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ప్రయాణంలో ఆగుతాయి.
ఈ కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు, మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రైలు విద్యార్థులకు, వ్యాపారులకు, ఇతర ప్రయాణికులకు కూడా పేర్కొన్న స్టేషన్లకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి