రైతుల ఖాతాల్లోకి రూ.7,000 జమ.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పూర్తి వివరాలు ఇవే
ఏపీ రైతులకు మంచి వార్త వచ్చింది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈసారి రైతులకు రెండు పథకాల డబ్బులు కలిపి అందించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000.
అంటే ఒక్క రైతుకి మొత్తం రూ.7,000 జమ అవుతాయి.
ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తారు.
ఎలాంటి మధ్యవర్తులు ఉండరు.
ఈ నిధులతో రైతులు
పంట పెట్టుబడులకు,
విత్తనాలు, ఎరువులు కొనడానికి,
ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తూ
ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
అర్హులైన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రైతులు ఇప్పుడు ఏం చేయాలి?
ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి.
మొదటిగా ఆధార్ – బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి.
బ్యాంక్‌లో e-KYC పూర్తి చేసి ఉండాలి.
రెండోది,
పీఎం కిసాన్ లిస్టులో పేరు ఉండాలి.
ఇ-కేవైసీ పూర్తి కాకపోతే డబ్బులు జమ కావు.
అందుకే రైతులు
సమీపంలోని
సచివాలయం,
వ్యవసాయ కార్యాలయం,
లేదా బ్యాంక్‌కు వెళ్లి
తమ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
డబ్బులు ఎప్పుడు ఇస్తారు?
ప్రభుత్వ సమాచారం ప్రకారం
వచ్చే నెల చివరి వరకు
లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో
రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.
అర్హులైన రైతులందరికీ
దశలవారీగా
నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు.
కాబట్టి
అర్హత ఉన్న రైతులు
ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
కేవైసీ పూర్తి చేస్తే
డబ్బులు ఖాతాలోకి వస్తాయి.
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి