డిసెంబర్ 31 డెడ్‌లైన్ ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి లేకపోతే పాన్ ఇనాక్టివ్
ఇంకా ఆధార్ పాన్ లింక్ చేయలేదా అయితే ఇప్పుడు తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్‌గా చెప్పేసింది డిసెంబర్ 31లోగా ఆధార్ పాన్ లింక్ చేయకపోతే పెనాల్టీ తప్పదు అని. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కానీ గడువు అయిపోయాక మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అయిపోతుంది. అలా అయితే బ్యాంక్ పనులు ఐటీఆర్ ఫైలింగ్ రీఫండ్ లావాదేవీలు అన్నీ స్టాప్ అవుతాయి.
లింక్ చేయకుండా వదిలేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఆ ఫైన్ కట్టిన తర్వాతే పాన్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అందుకే ఇప్పుడే చేసేయడం బెస్ట్. ముఖ్యంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ తీసుకున్నవాళ్లైతే తప్పకుండా లింక్ చేయాలి.
ఇప్పుడు ఎలా లింక్ చేయాలో చెప్పుతా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీ మొబైల్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో incometax.gov.in ఓపెన్ చేయండి. అక్కడ క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. మీ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్‌లో ఉన్న పేరు పుట్టిన తేదీ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అవసరమైతే వెయ్యి రూపాయలు ఆన్లైన్‌లో కట్టండి. అంతే మీ పని అయిపోయింది.
ఇంకా ఈజీగా కావాలంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేయొచ్చు. UIDPAN స్పేస్ మీ ఆధార్ నంబర్ స్పేస్ పాన్ నంబర్ టైప్ చేసి 567678 లేదా 56161కి పంపించండి. కొద్దిసేపట్లో లింక్ స్టేటస్ వస్తుంది.
మీ ఆధార్ పాన్ లింక్ అయిందా లేదా చెక్ చేయాలంటే అదే వెబ్‌సైట్‌లో నో ఆధార్ పాన్ లింక్ స్టేటస్ ఆప్షన్‌లో పాన్ ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి చూసుకోవచ్చు. ఆలస్యం చేయొద్దు డిసెంబర్ 31లోగా ఈ పని అయిపోతే ఫైన్ కూడా ఉండదు టెన్షన్ కూడా ఉండదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి