జనవరిలో 13 రోజుల సెలవులు – డేట్స్‌తో పూర్తి వివరాలు
జనవరి 2026 నెలలో సెలవులు ఉద్యోగులు, విద్యార్థులకు ఫుల్ జోష్ ఇచ్చేలా ఉన్నాయి. పండుగలు, జాతీయ సెలవులు, వీకెండ్లు కలిపి ఈ నెలలో మొత్తం మీద సుమారు 13 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
జనవరి 1, గురువారం – న్యూ ఇయర్ సందర్భంగా చాలా చోట్ల సెలవు ఉంటుంది.
జనవరి 3, శనివారం – హజ్రత్ అలీ జయంతి (ఐచ్చిక సెలవు – కొన్ని రాష్ట్రాల్లో).
జనవరి 4, ఆదివారం – వీకెండ్ సెలవు.
ఇక జనవరి 10, శనివారం మరియు జనవరి 11, ఆదివారం వరుసగా వీకెండ్లు రావడంతో మరో రెండు రోజులు సెలవులుగా మారనున్నాయి.
సంక్రాంతి పండుగ సీజన్‌లో,
జనవరి 13, మంగళవారం – భోగి,
జనవరి 14, బుధవారం – మకర సంక్రాంతి / పొంగల్,
జనవరి 15, గురువారం – కనుమ,
ఈ మూడు రోజులు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులుగా ఉంటాయి.
దీంతో పాటు
జనవరి 17, శనివారం మరియు జనవరి 18, ఆదివారం వీకెండ్లు కలవడంతో సంక్రాంతి సమయంలో లాంగ్ వీకెండ్ లభించే అవకాశం ఉంది.
మరోవైపు
జనవరి 23, శుక్రవారం – నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (కొన్ని చోట్ల ఐచ్చిక సెలవు).
చివరగా
జనవరి 24, శనివారం,
జనవరి 25, ఆదివారం,
జనవరి 26, సోమవారం – రిపబ్లిక్ డే (జాతీయ సెలవు).
ఈ మూడు రోజులు వరుసగా రావడంతో నెల చివర్లో మరో లాంగ్ వీకెండ్ ఏర్పడనుంది.
మొత్తం మీద జనవరి 2026 నెలలో పండుగలు, వీకెండ్లు, జాతీయ సెలవులు కలిపి సుమారు 13 రోజులు సెలవుల ఆనందం లభించనుంది. అయితే సెలవులు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల ప్రకారం మారే అవకాశం ఉండటంతో అధికారిక హాలిడే లిస్ట్‌ను తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి